ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Angel Fish: మత్స్యకారుల వలలో అందమైన చేప.. రుచి తెలిస్తే.. - angel fish found at pudimadaka in anakapalle

Angel Fish: ఓ అరుదైన చేప పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. చూడటానికి ఎంతో అందంగా ఉన్న దీని పేరు ఏంజెల్.. కానీ అక్కడి స్థానికులు 'సానిపాప'గా పిలుస్తారు.

Angel Fish
మత్స్యకారుల వలకు చిక్కిన ఏంజెల్

By

Published : Apr 24, 2022, 8:02 AM IST

Angel Fish: అరుదైన చేప అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. ఏంజెల్‌ అనే ఈ చేపను స్థానికులు ‘సానిపాప’గా పిలుస్తారు. అడుగు పొడవున్న చేపను స్థానిక మార్కెట్​లో రూ.200లకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇవి సముద్రం అడుగున రాళ్ల మధ్య తిరుగుతూ.. అరుదుగా ఉపరితలానికి వస్తుంటాయి. ఆ సమయంలో వలలకు చిక్కుతాయి. చూడటానికి అందంగా ఉన్నా.. రుచి తక్కువగా ఉండటంతో ఎక్కువమంది కొనేందుకు ఇష్టపడరు. సాధారణంగా ఇవి 5 కిలోల వరకు పెరుగుతాయని, ప్రోమోకాట్స్‌ వీటి శాస్త్రీయనామం అని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details