Agricultural Research Centres: రైతులు ఆర్థికంగా బలపడాలంటే సరైన విత్తనం అవసరం. పంటలకు పురుగులు, తెగుళ్లు సోకితే వాటిని సకాలంలో నివారించే యాజమాన్య విధానాలు రూపొందించాలి. దీనికి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో దోహదపడతాయి. రాష్ట్ర విభజన తర్వాత ప్రధానమైన పరిశోధన కేంద్రాలు తెలంగాణలో ఉండిపోయాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పరిశోధన కేంద్రాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
No Reserch in Agriculture Labs: అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్కు స్వయంగా వచ్చి సమీక్ష నిర్వహించారు. పరిశోధన కేంద్రాలలో ప్రధానమైన అనకాపల్లి కేంద్రానికి భారీగా నిధులు మంజూరు చేశారు. ఖాళీ పోస్టులు భర్తీ చేశారు. అనకాపల్లి కేంద్రానికి దాదాపు 6 కోట్ల రూపాయలు, ఎలమంచిలి పరిశోధన క్షేత్రానికి కోటి 75 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో ప్రయోగశాలలు, రైతు శిక్షణ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతా తారుమారైంది. నిధులు నిలిపేసి, శాస్త్రవేత్తలను బదిలీల పేరుతో ఇక్కడి నుంచి తరలించడంతో పరిశోధనలపై ప్రభావం పడింది.
ఏరువాక కేంద్రాలు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు.. ఆవేదనలో రైతులు
Research Centres in AP: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనకాపల్లి పరిశోధన కేంద్రంలో.. ప్రయోగశాలలు శిథిల భవనాల్లో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. అన్ని పరిశోధనలు ఒకే చోట నిర్వహించేలా టీడీపీ ప్రభుత్వ హయాంలో 3కోట్ల 47లక్షల రూపాయలు భవన సముదాయ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారి నిధులు రాకపోవడంతో గుత్తేదారు గోడల స్థాయిలోనే పనులు నిలిపేశారు. 2కోట్ల 32లక్షల రూపాయలతో చేపట్టిన రైతు శిక్షణ భవన నిర్మాణమూ పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది.
Agriculture Labs in AP: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో నువ్వుల పరిశోధన కేంద్రంలో వేరుసెనగపైనా పరిశోధనలు చేపట్టేలా టీడీపీ ప్రభుత్వం ఇద్దరు శాస్త్రవేత్తలను అదనంగా నియమించింది. విత్తన నిల్వకు 75 లక్షల రూపాయలతో గోదాం, రైతుల శిక్షణకు కోటి రూపాయలుతో భవనం మంజూరు చేసినా.. వైసీపీ సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనకాపల్లి పరిశోధన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలను బదిలీ చేస్తున్న ప్రభుత్వం కొత్త వారిని నియమించడం లేదు.