Bus Accident : తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట వద్ద ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో45 మంది ప్రయాణీకులు ఉన్నారు.
గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ నలుగురి తలకు బలమైన గాయాలు కావడంతో కోమాలో ఉన్నారని.. ప్రస్తుతం అక్యూవెన్సీలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ఇప్పుడేమి చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 12మంది ప్రయాణికులు గాయపడగా సమీపాన లంగర్ హౌస్‌లోని రినోవా ఆసుపత్రికి తరలించారు.