ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాకు 'జమాత్-ఇ-ఇస్లామీ హింద్' మద్దతు

తెలుగుదేశం పార్టీకీ జమాత్-ఇ-ఇస్లామీ హింద్ సంపూర్ణ మద్దతు పలికింది. పలువులు జమాత్-ఇ-ఇస్లామీ హింద్, ముస్లిం మైనారిటీ నాయకులు ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

By

Published : Apr 1, 2019, 6:23 PM IST

జమాత్-ఇ- ఇస్లామీ హింద్ నాయకులు

సీఎం చంద్రబాబుతో జమాత్-ఇ- ఇస్లామీ హింద్ నాయకులు
తెలుగుదేశం పార్టీకీ జమాత్-ఇ-ఇస్లామీ హింద్ సంపూర్ణమద్దతు పలికింది. పలువులు జమాత్-ఇ-ఇస్లామీ హింద్, ముస్లిం మైనారిటీ నాయకులు అమరావతిలో సీఎం చంద్రబాబుతో బేటీ అయ్యారు.

దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీలకే మద్దతు
దేశవ్యాప్తంగా బాజపా వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మద్దతు ప్రకటించిందని జమాత్-ఇ-ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫీఖ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థుల గెలుపునకు మద్దతు తెలుపుతూ...జమాత్-ఇ-ఇస్లామీ హింద్ సభ్యులు ప్రచారంలో పాల్గొననున్నారు. గత 70 ఏళ్లుగా దేశ సమైఖ్యతకు కృషి చేస్తూ...తమ సంస్థ ద్వారాదేశవ్యాప్తంగా సామరస్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో లౌకిక శక్తుల్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు, తమ సంస్థ పూర్తిగా మద్దతు తెలుపుతుందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని మహ్మద్ రఫీక్ వెల్లడించారు.

మద్దతు తెలిపిన ఏపీ యాదవ మహాసభ
ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాలకొండయ్య, సెక్రటరీ జనరల్ తులసీ రాం, కోశాధికారి బాలయ్య యాదవ్ లు సీఎం నివాసంలో భేటీ అయ్యారు. రాజధానిలో 10 ఎకరాలు భూమిని , యాదవ సంక్షేమ భవన నిర్మాణానికి 10కోట్ల రూపాయలను కేటాయించాలని యాదవ మహాసభ నాయకులు ముఖ్యమంత్రిని కోరారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details