పుల్వామా ఘటనపై విజయవాడలో సిక్కుల నిరసన వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలు, శిక్కు మతస్థుల ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం నశించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ర్యాలీలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఉగ్ర దాడులకు కేంద్రం దీటుగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఇవికూడా చదవండి