'కర్నూలు అభివృద్ధి నా బాధ్యత' - ముఖ్యమంత్రి చంద్రబాబు
గౌరు చరిత దంపతుల్ని కండువా కప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. పాణ్యం, నందికొట్కూరులో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
By
Published : Mar 10, 2019, 12:06 AM IST
ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు జిల్లాలోని మొత్తం 14 శాసనసభ స్థానాలూ మనమే గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేతలతోఅన్నారు. గౌరు చరిత దంపతుల్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాణ్యం, నందికొట్కూరులో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గౌరు చరితారెడ్డి చాలా హుందాగా ఉంటారని... తన ఆలోచనలకు దగ్గరగా ఉండే వ్యక్తని తెలిపారు. కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు జీతాలు తీసుకుంటున్నా శాసనసభకు మాత్రం హాజరుకారన్నారు.