ETV Bharat / state
జగన్పై ఎన్నికల సంఘానికి కే.ఏ. పాల్ ఫిర్యాదు - ec
వైకాపా అధినేత జగన్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీకి నష్టం కలిగించేలా వైకాపా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తున్నకేఏ పాల్
By
Published : Mar 27, 2019, 10:58 PM IST
| Updated : Mar 28, 2019, 1:19 AM IST
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ప్రతిపక్ష నేత జగన్పై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా వుండే పేర్లతో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసిందని ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తమ పార్టీ గుర్తును తొలగిచేందుకు వైకాపా ప్రయత్నించిందని ద్వివేదికి వివరించారు. అంతేకాక రాష్ట్రంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదు చేశారు. తనపై వైకాపా అనుచరులు ఈనెల 23అర్థరాత్రి దాడికి యత్నించారని పాల్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను ఈసీకి ఇచ్చానని తెలియజేశారు. Last Updated : Mar 28, 2019, 1:19 AM IST