ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలకృష్ణకు నోటీసులు - ycp

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీచేసింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై వ్యాజ్యం దాఖలైంది.

బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

By

Published : Feb 23, 2019, 3:49 AM IST

Updated : Feb 23, 2019, 7:29 AM IST

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ హిందూపురం ఎమ్మెల్యే, నటుడుబాలకృష్ణపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు నోటీసులు జారీచేసింది.విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

బాలకృష్ణ

నంద్యాల ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి తరుపున ప్రచారం చేస్తూ.. ఓటర్లకు బాలకృష్ణ బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని హైకోర్టును ఆశ్రయించారు వైకాపా ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్.ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది.. బాలకృష్ణకోడ్ఉల్లంఘించారనీ..ఆయనపైకేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. వ్యాజ్యంలో బాలకృష్ణ వాదనలు వినాలని భావించిన కోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది.

Last Updated : Feb 23, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details