వెల్లువలా 'ఓటు' దరఖాస్తులు! - election office
రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఇంకా 2 రోజులే సమయం ఉంది. వేలాది మంది.. ఆన్లైన్లో ఇప్పటికీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారుల వద్దా క్యూలు పెరిగిపోయాయి.
ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉత్సాహం చూపిస్తున్నారు.ఓటరుగా పేరు నమోదు చేసుకోవటానికి ఇంకా 2 రోజులేగడువు ఉన్న కారణంగా... కార్యాలయాల వద్ద రద్దీ పెరిగిపోయింది.ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఫామ్ 6దరఖాస్తులు చేస్తుండటంతో సర్వర్లు నెమ్మదించాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవల్ అధికారుల కార్యాలయాల వద్ద క్యూలు పెరిగిపోయాయి. ఈ సంఖ్యకు తగిన రీతిలో సిబ్బంది లేక...దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులూ రద్దీని తట్టుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎల్లుండితో గడువు తీరనున్న దృష్ట్యా.. వీలైనంత త్వరగా ఓటును నమోదు చేసుకోవాలని ప్రజలు ఆరాటపడుతున్నారు. ఒట్లు గల్లంతైన వారు.. జాబితాలో పేరు లోని వారు.. చిరునామా మార్చుకునే వారు.. దరఖాస్తుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.