'అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి'
అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్.. ప్రక్రియ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నెమ్మదిగా కొనసాగుతోందని బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి
ఒక కుటుంబంలో 10 వేల లోపు ఎన్ని డిపాజిట్లు ఉన్నా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు తీర్పులో ఉన్నట్టు గుర్తుచేశారు. కేవలం ఒక్క డిపాజిట్ మాత్రమే తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు ఏ రూపంలో ఉన్నా.. వాటిని పరిగణలోకి తీసుకుని చెల్లింపులు చేయాలన్నారు. బాధితులకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉండాల్సిన అడ్వకేట్ జనరల్.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని... లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.