DOLI: పాముకాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని.. డోలీలో 6 కిలోమీటర్ల దూరం మోసుకొళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు మండలం మారుమూల సలుగు పంచాయతీ దబ్బగరువులో ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే 6 కిలోమీటర్ల వరకు రహదారి లేకపోవడంతో.. అంబులెన్స్ వచ్చే అవకాశమే లేదు. దీంతో స్థానిక యువకులు డోలీ కట్టి.. సెల్ ఫోన్లైట్ల సహాయంతో కొండపై నుంచి అతి కష్టం మీద బాధితున్ని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏళ్లు గడుస్తున్నా.. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేక.. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రావడంలేదంటూ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. బాహ్య ప్రపంచం రావాలంటేనే కొండ మార్గం గుండా గంటల తరబడి నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
'డోలీ'నే అంబులెన్స్.. పాము కరిచిన వ్యక్తిని మోస్తూ ఆరు కిలోమీటర్లు!
DOLI: ప్రమాదం తీవ్రతను బట్టి కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.. అలాంటి బాధితులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే.. ప్రాణాలు రక్షించడానికి అంత మేర అవకాశం ఉంటుంది.. మరి, అంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఏం కావాలి? అంబులెన్స్ లేదా.. మరో వాహనం కావాలి. కానీ.. అభివృద్ధికి దూరంగా అడవుల్లో బతికే గిరిజనానికి.. వాహన సౌకర్యం సంగతి అటుంచితే.. నడిచేందుకు కనీసం దారి కూడా లేని దుస్థితికి దర్పణం ఈ ఘటన. పాము కాటు వేసిన వ్యక్తిని రక్షించుకునేందుకు.. డోలీనే అంబులెన్స్ గా మార్చి, ఆసుపత్రికి తరలించేందుకు ఏకంగా 6 కిలోమీటర్లు నడిచారంటే.. మన పాలకులు సాధించిన అభివృద్ధి వైశాల్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు..!
Last Updated : May 27, 2022, 12:33 PM IST
TAGGED:
ap latest news