ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి! - వాగులో గల్లంతై ఇద్దరు యువకులు మృతి

సరదాగా స్నానానికి దిగి.. వాగులో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాములేరు వద్ద చోటుచేసుకుంది. మృతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

వాగులో గల్లంతై ఇద్దరు యువకులు మృతి
వాగులో గల్లంతై ఇద్దరు యువకులు మృతి

By

Published : Jun 19, 2022, 9:15 PM IST

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు వద్ద విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు మారేడుమిల్లి పర్యాటక అందాలను సరదాగా తిలకించేందుకు వచ్చారు. అనంతరం స్నానాలు చేసేందుకు పాములేరు వాగులో దిగగా.. కాళిదాసు సందీప్ (20), దాన అరుణ్ కుమార్ (22) అనే ఇద్దరు యువకులు మునిగిపోయారు.

తోటి స్నేహితులు కేకలు వేయటంతో జంగిల్ స్టార్ పర్యాటక ప్రాంతం సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిపోయిన ఇద్దరు యువకులూ అప్పటికే మృతి చెందటంతో.. మృతదేహాలను బయటకు తీశారు. సందీప్ కారు డ్రైవర్​గా పని చేస్తుండగా.. అరుణ్ కుమార్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నట్లు ఎస్​ఐ రాము తెలిపారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details