Lorry Fell into the Valley: ఎంతో ఉల్లాసంగా సాగుతున్న వారి ప్రయాణానికి.. ఆ ఘాట్ రోడ్లో బ్రేక్ పడింది. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు సమీపంలోని.. ఘాట్ రోడ్లో లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి, సురేష్ అనే ఇద్దరు పర్యటకులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
విహారయాత్రలో విషాదం.. లారీ లోయలో పడి ఇద్దరు మృతి - అల్లూరి జిల్లాలో ప్రమాదం
Lorry Fell into the Valley: వారంతా సంతోషంగా సమయం గడుపుదామని విహారయాత్రకు వచ్చారు. సరదాగా లారీ ఎక్కారు. కానీ ఘాట్ రోడ్లో ఆ లారీ ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది.
![విహారయాత్రలో విషాదం.. లారీ లోయలో పడి ఇద్దరు మృతి Lorry Fell into the Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17657975-262-17657975-1675420690871.jpg)
లోయలో పడిన లారీ
చింతూరులోని జలతరంగని జలపాతం తిలకించి రాజమహేంద్రవరం వెళ్లేందుకు లారీ ఎక్కారు. మారేడుమిల్లి ఘాట్ రోడ్లో లారీ లోయలోకి దూసుకుపోవడంతో.. ప్రమాదం జరిగింది. పర్యాటకులు ఒంగోలు జిల్లా దర్శి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. సరదా కోసం వచ్చినవారు ఇలా మరణించడంతో.. విహారయాత్ర విషాదంగా మారింది.
ఇవీ చదవండి: