అల్లూరి జిల్లాలో ఆగని శిశు మరణాలు.. తాజాగా మరో ఇద్దరు - అల్లూరి సీతారామరాజు జిల్లా తాజా వార్తలు
CHILDRENS DEATH: అల్లూరి జిల్లా మన్యంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలోని చెక్కరాయిలో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మూడేళ్ల కిందట ఇదే గ్రామంలో మూడు నెలల వ్యవధిలో 12 మంది చిన్నా, పెద్దా మృతి చెందారు. గతేడాది ఇదే ప్రాంతంలోని రూఢకోటలో 2 నెలల్లోనే 14 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. సూకూరులోనూ ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. తాజాగా ఇద్దరు చిన్నారులు మృతి చెందినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. చెక్కరాయి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు.
అల్లూరిలో ఆగని శిశుమరణాలు