ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High Electricity Bill: ఒక పూరి గుడిసె.. రెండు బల్బులు.. బిల్లు మాత్రం అక్షరాల అర లక్ష.. ఎక్కడో తెలుసా? - current bill fifty thousand rupees for two bulbs

High current bill: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయింది ఆ వృద్ధ దంపతుల పరిస్థితి. జీవించడానికే అష్టకష్టాలు పడుతున్న వారికి కరెంట్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఆ కరెంట్ బిల్లు చూసిన ఆ దంపతులు 'మేము ముసలోళ్లం.. మాకు ఇల్లే సరిగా లేదు.. అంత బిల్లు ఎలా కట్టాలని' అంటున్నారు. అసలు బిల్లు ఎంత వచ్చిందో తెలుకుందామా?

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 26, 2023, 9:49 AM IST

విద్యుత్ బిల్లు 52వేలు రావడంతో షాక్‌కు గురైన వృద్ధదంపతులు

High current bil In l: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెద‌బ‌ర‌డ‌ గ్రామంలో వృద్ద దంపతులకు విద్యుత్తు బిల్లు ఎవ్వరు ఊహించనంతగా రావడంతో షాక్ త‌గిలింది. పెద‌బ‌ర‌డ‌లో పోటుకూరి సత్తి కొండ భార్య రాములమ్మ ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఆ మీటర్​పై రెండు బ‌ల్బులు వెలుగుతుండ‌గా, బిల్లు మాత్రం అర ల‌క్ష రావ‌డంతో వృద్ద దంప‌తులు ఒక్కసారిగా ఆర్చర్య పోయారు. ఈ వృద్ధాప్యంలో అంత కరెంట్ బిల్లు ఎలా కట్టాలో కట్టాలో తెలియక ల‌బోదిబోమంటున్నారు.

" మాకు కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. మాకు ఉండేది రెండు బల్బులు మాత్రమే. ఇంటి లోపల ఒకటి, ఇంటి బయట ఒక బల్బు పెట్టుకున్నాం. 20 వేలు, 50 వేల కరెంటు బిల్లులు వస్తున్నాయి. మేము బతకడమే కష్టంగా ఉంది. ముసలోళ్లం పింఛన్ మీద ఆధారపడి బతికేవాళ్లం. అంత ఎక్కువ కరెంటు బిల్లు వస్తే ఎలా కట్టగలం సార్. ప్రభుత్వం ఆలోచించి మనల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. " - సత్తిపండు, బాధితుడు

ఎక్కవ కరెంటు బిల్లు.. రాని వైఎస్సార్ చేయూత :ఇంటి బయట ఒకటి, లోపల ఒక బుల్బులు ఉన్నాయి. ఉన్న బ‌ల్బులు కూడా పొదుపుగా విద్యుత్తు వాడుకుంటూ సాయంకాలం సమయంలో భోజనం చేసేటప్పుడు ఒక గంట మాత్రం వాడి మరల ఆర్పేసి నిద్ర‌పోతున్నారు. అటువంటిది ఒక్క‌సారిగా అధిక‌ మొత్తంలో బిల్లు రావ‌డంతో ఏమి చేయాలో పాలుపోవ‌డం లేదని వారు అంటున్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఈ వృద్ధ దంపతులు కోరుతున్నారు. త‌రుచూ బిల్లులు అధికంగా రావ‌డంతో త‌మ‌కు రావాల్సిన వైఎస్సార్ చేయూత కూడా రావ‌డం లేద‌ని స‌త్తిపండు భార్య రాముల‌మ్మ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది.

" మాకు ఇళ్లు లేదు.. పట్టు లేదు.. మాకు అలాంటిది ఎక్కవగా కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. మేము ముసలివాళ్లం. మేము బతకడమే చాలా ఇబ్బందిగా ఉంది. కూలీకి వెళ్లి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాము. అలాగే దానికి తోడు మా ఆయనకి పింఛన్ వస్తుంది వాటితోనే బతకాలి. అలాంటిది ఇంత బిల్లులు ఇస్తున్నారు. మీరే ఏదోకటి చేయాలి? మాకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని.. వైఎస్సార్ చేయూత కూడా రావటం లేదు. మాకు ఎటువంటి ఎలాక్ట్రానిక్ వస్తువుల లేవు. కేవలం రెండు బల్బులకే 50 వేల కరెంట్ బిల్లు వచ్చింది. " - రాములమ్మ, బాధితురాలు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details