TRIBAL PROTEST : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల పరిధిలో.. హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు రద్దు చేయాలంటూ.. గిరిజనులు రోడ్డెక్కారు. గిరిజన సంఘం పిలుపుతో.. చింతపల్లి, జికె వీధి, కొయ్యూరు మండలాల్లో వేకువ జామునే రోడ్లపై.. బైఠాయించారు. లంబసింగి -కొర్రుబయలు సెంటర్లో రాస్తారోకో చేశారు. వ్యవసాయం ముద్దు ప్రాజెక్ట్లు.. వద్దు అంటూ నినాదాలు చేశారు. ఐతే.. వాహనాల రాకపోకలకు వీలు కల్పించాలని పోలీసులు గిరిజన సంఘాలను కోరారు. చింతపల్లి మండలం ఎర్రబయలు, గొందిపాకతోపాటు కొయ్యూరు మండలంలోని మరో రెండు గ్రామాలు ప్రజలు.. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల నిరాశ్రయులవుతారు.
యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు.. రోడ్డెక్కిన గిరిజనలు.. నిలిచిపోయిన రాకపోకలు - చింతపల్లిలో గిరిజనుల నిరసన
TRIBAL PROTEST IN ALLURI DISTRICT : ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని రోడ్డెక్కారు. పంటలు, ఫలాలు పండిస్తూ జీవిసిస్తున్నామని.. పవర్ ప్రాజెక్టు వస్తే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

లంబసింగిలో రహదారిపై బైఠాయించి నిరసన: యర్రవరం హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగిలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, గిరిజనులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 3 గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంద్‌కు మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: