PROBLEMS: భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొండ వాగు ఉద్ధృతి పెరిగింది. పాడేరు మండలంలోని కించూరులో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో గ్రామం వెలుపలకు వచ్చేందుకు ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. మరో మార్గం లేక ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ అత్యంత ప్రమాదకరమైన ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పెదబయలు మండలం గుంజివాడ-జామిగుడ గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాలు దాటడానికి గిరిజనులు ప్రవాహాలకు ఎదురీదుతూ గమ్యానికి చేరుతున్నారు. వంతెనలు లేకపోవడం వల్ల.. వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేయాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.