HERO SAI DHARAM TEJ : విద్యార్థులే భావితరాలకు స్ఫూర్తి దాతలు కావాలని ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జూనియర్ కళాశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదక పదార్థాలను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొద్దిసేపు జూనియర్ కళాశాల విద్యార్థులతో మమేకమయ్యారు.గంజాయి వంటి డ్రగ్స్ జోలికి పోకుండా చదువు పైనే దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
కనిపెంచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. గిరిజన ప్రాంతంలో ఉంటూ ఉన్నత చదువులు అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. మన్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాలను నిలువరించేందుకు వీలుగా పోలీస్‌శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి వారికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.