ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Three Crore Worth Ganja Seized: అల్లూరి జిల్లాలో రూ.3 కోట్లకు పైగా విలువైన గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్..

Three Crore Worth Ganja Seized: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా విలువైన గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన అధికారులు.. సుమారు 1,400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Three_Crore_Worth_Ganja_Seized
Three_Crore_Worth_Ganja_Seized

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 11:45 AM IST

Three Crore Worth Ganja Seized: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింత‌ప‌ల్లి మండ‌లంలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. సుమారు 1,400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు.

One Crore Worth Ganja Seized in Alluri District: కోటి విలువైన గంజాయిని స్వాధీనం.. నిందితుల్లో వార్డు వాలంటీర్

ఆ సమయంలో ఓ కారుకు ఎస్కార్టుగా ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. వారి వెనుక వస్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వాహనంలో నుంచి ఒక వ్యక్తి బయటకు దూకి పారిపోగా.. డ్రైవర్​తోపాటు మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిందితుల నుంచి 1,400 కిలోలగంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని దగుడుపల్లి గ్రామానికి చెందిన కిలో సత్తిబాబు, మరికొందరు అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసు అధికారులు తెలిపారు. చింతపల్లి మండలం భీమసింగికి చెందిన డ్రైవరు ప్రసాద్‌, రాళ్లగెడ్డకు చెందిన సిందేరి చిన్నయ్యను ఈ ఘటనలో అరెస్టు చేసి, రూ.లక్ష నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తనిఖీల్లో సీఐ రమేశ్, చింతపల్లి, అన్నవరం ఎస్సైలు ఎంవీ రమణ, అరుణ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

Nellore Police Seized 75 Kgs Ganja: నెల్లూరు జాతీయ రహదారిపై కారు బోల్తా.. 75 కేజీల గంజాయి పట్టివేత

"జిల్లాలోని చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున మా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ కారుకు ఎస్కార్టుగా ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు మా అధికారులను చూసి పారిపోయారు. వారి వెనుక వస్తున్న కారును ఆపేందుకు మేము ప్రయత్నించాము. దీంతో వాహనంలో నుంచి ఒక వ్యక్తి బయటకు దూకి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో డ్రైవర్​తోపాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. ఈ క్రమంలో నిందితుల నుంచి 1,400 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నాము. డిశాలోని దగుడుపల్లి గ్రామానికి చెందిన కిలో సత్తిబాబు, మరికొందరు అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్లు మా విచారణలో వెల్లడైంది. చింతపల్లి మండలం భీమసింగికి చెందిన డ్రైవరు ప్రసాద్‌, రాళ్లగెడ్డకు చెందిన సిందేరి చిన్నయ్యను ఈ ఘటనలో అరెస్టు చేసి, రూ.లక్ష నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము." - ప్రతాప్‌ శివకిషోర్‌, చింతపల్లి అదనపు ఎస్పీ

304 kgs ganja seized : గన్నవరంలో 304 కేజీలు, నెల్లూరులో వంద కిలోల గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details