Heavy rains Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. రంపచోడవరం నుంచి పర్యటక ప్రాంతమైన రంప వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే తాటివాడ నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో వాగులు ఉదృతంగా ప్రవహించాయి. మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద కొండ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి దీంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు.
Heavy rains అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - రంపచోడవరం
Suffering From Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో జోరువానలు కురుస్తున్నాయి. కోస్తాలోని.. అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా కురిసే వార్షాల వల్ల జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా వర్షాలు