Student Suspicious Death: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ వెనుక బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. పాడేరులోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వెనక విద్యార్థి విగత జీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా... విద్యార్థి మృతి చెంది ఉన్నాడు. గిరిజన పాఠశాల విద్యార్థులను పిలిచి వివరాలు అడగగా.. విద్యార్థి పాంగి నవీన్‌గా గుర్తించారు. శుక్రవారం రోజు నవీన్ ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చాడని విద్యార్థులు చెప్పారు.
పాడేరులో విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..? - పాడేరులోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల
Student Suspicious Death: పాడేరులో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గిరిజన పాఠశాల వెనక విద్యార్థి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. రంగంలోకి దిగారు. విద్యార్థి గిరిజన పాఠశాల విద్యార్థి అని గుర్తించినప్పటికి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మృతదేహం
అయితే ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన నవీన్.. మళ్లీ ఎప్పుడు బయటకు వెళ్లాడో.. ఎవరైనా చంపి పడేశారా అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మాడుగుల మండల గెమ్మిలి పంచాయతీ సుర్లపాలెంకు చెందినవాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: