ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sago: వర్షం కురిసింది.. కాండం విరిసింది

Sago: సాధారణంగా సగ్గు దుంప మొక్కల కాండాలను ఖరీఫ్‌ సీజన్‌లో నాటడానికి ముందుగానే ముక్కలు కోసి నిల్వ ఉంచుతారు. అయితే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ రైతు.. ఫిబ్రవరి నెలలో కాండాలను కుప్పగా ఏర్పాటు చేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కాండాలకు ఆకులు ఎక్కువగా రావడంతో పెద్ద చెట్టులా కనిపిస్తూ అందిరిని ఆకట్టుకుంటోంది.

Sago plant stem looks likes tree at alluri seetharamaraju district
సగ్గు రాశి.. పచ్చదనం విరిసి

By

Published : May 8, 2022, 9:42 AM IST

Sago: సాధారణంగా సగ్గు దుంప (సగ్గు బియ్యం తయారీకి ఉపయోగించే) మొక్కల కాండాలను ఖరీఫ్‌ సీజన్‌లో నాటడానికి ముందుగానే ముక్కలు కోసి నిల్వ ఉంచుతారు. వర్షం పడిన తరువాత వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే దుక్కు దున్ని వాటిని భూమిలో నాటితే మొక్కలుగా వస్తాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో కౌలు రైతు నమోదు రాజు సాగుచేస్తున్న పొలంలో నాటేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాండాలను రాశి (కుప్ప)గా ఏర్పాటు చేసి ఉంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కాండాలకు ఆకులు ఎక్కువగా రావడంతో పెద్ద చెట్టులా కనిపిస్తూ.. చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details