Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిజల్ట్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ చైర్పర్సన్ సుభద్రతో కలిసి డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ సంప్రదాయమైన దింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు.
ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటన..గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం - Agency traditional Dimsa dance
Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి వద్ద రూ.మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్స్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. జిల్లా ఏజెన్సీ ఏరియాలో పర్యటించిన ఆమె.. ఏజెన్సీ సంప్రదాయమైన ధింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు.
రోజా
ప్రస్తుతానికి హరిత రిసార్ట్స్ 60% మాత్రమే పనులు అయ్యాయి. మిగిలిన పనులు జరగాల్సి ఉంది. మారుమూల అల్లూరి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నందున.. తమ సంస్థ తరఫున హరిత రిసార్ట్స్ నిర్మాణం పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 18, 2022, 2:14 PM IST