అల్లూరి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి - ఏపీ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి
06:42 June 13
చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ఘటన
Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కూలి పనులకు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. మృతులు ధనేశ్వర్ దళపతి(24), జీతు హరిజన్(5), సునేనా హరిజన్(2).. క్షతగాత్రులు ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: