ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణాది విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము - ఏపీ రాజకీయ వార్తలు

President Draupadi Murmu Will Come to The State: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి రానున్నారు. 26వ తేదీ నుంచి 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లు దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన ద్రౌపది ముర్ము తొలిసారి దక్షిణాది విడిదికి వస్తున్నారు.

President Draupadi Murmu
President Draupadi Murmu

By

Published : Dec 14, 2022, 10:57 PM IST

President Draupadi Murmu Will Come to The State: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. 26వ తేదీ నుంచి 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లు దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన ద్రౌపది ముర్ము తొలిసారి దక్షిణాది విడిదికి వస్తున్నారు. 26న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి.. అదే రోజు శ్రీశైలం వెళ్తారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శంచుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆ తరువాత సికింద్రాబాద్ వచ్చి యుద్ధ స్మారకం వద్ద వీరులకు నివాళి అర్పించి వీరనారీలను సన్మానిస్తారు. రాష్ట్రపతి గౌరవార్థం ఆ రోజు రాత్రి రాజ్​భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొంటారు. 27న నారాయణగూడ కేశవ్ మెమోరియల్ సొసైటీకి వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడ విద్యార్థులు, సిబ్బందితో సమావేశమవుతారు.

అనంతరం సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లిశిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులతో సమావేశం అవుతారు. 28న భద్రాచలం, ములుగు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటిస్తారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి, రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న ద్రౌపది ముర్ము.. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 29న హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి విద్యార్థులతో సంభాషిస్తారు.

ఆ రోజు సాయంత్రం సమతామూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనానికి రాష్ట్రపతి వెళ్తారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 30న మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. దక్షిణాది విడిది ముగించుకుని అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి దిల్లీ వెళ్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details