HIGH ALERT IN AGENCY AREAS: తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీగఢ్ సరిహద్దు ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఎ వారత్సోవాల నేపథ్యంలో గోదావరి తీరం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, మహముత్తారం, పలిమెల, కాటరం, మల్హర్ మండలాలు.. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మావోల వారోత్సవాలు.. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం - plga week
HIGH ALERT IN AGENCY AREAS: డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టుల పీఎల్‌జీఎ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులకు సహకరించకూడదంటూ స్థానికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
పీఎల్జీఏ వారోత్సవాలు
నిరంతరం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహకరించకూడదంటూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు మావోయిస్టుల వారోత్సవాలు, మరోవైపు పోలీసుల తనిఖీలతో గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొంది.
ఇవీ చదవండి: