ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUSPEND : పెదబయలు డిప్యూటీ తహసీల్దార్​, సీనియర్ అసిస్టెంట్​ సస్పెండ్​.. - ఏపీ తాజా వార్తలు

PEADABAYALU DEPUTY MRO SUSPENDED : మీ సేవ పనులు, భూ రీ సర్వే, ఇతర రెవెన్యూ పనుల్లో జాప్యం కారణంగా పెదబయలు డిప్యూటీ తహసీల్దార్​, సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

PEADABAYALU DEPUTY MRO SUSPENDED
PEADABAYALU DEPUTY MRO SUSPENDED

By

Published : Dec 10, 2022, 6:19 PM IST

DEPUTY MRO SUSPENDED : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మీ సేవ పనులు, భూ రీ సర్వే ఇతర రెవెన్యూ పనిలో జాప్యమే కారణం అని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. గతంలోని ఎమ్మార్వో సహా అందరూ ఉద్యోగులు పనులు జాప్యం చేస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల కిందట పెదబయలు ఎమ్మార్వో శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఉన్నతాధికారులు సదరు ఎమ్మార్వోను అందరి ముందు మందలించడమే కారణమని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనను అధికారులు పక్కదారి పట్టించడానికి కిందిస్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నాలు చేయగా ఏ ఒక్క అధికారి కూడా నోరు మెదపడం లేదని సమాచారం. సస్పెండ్​కు గురైన వారు మాత్రం తాము పెదబయలు మండలాన్ని అన్ని పనుల్లోనే నాలుగో స్థానంలో ఉంచామని.. అయినప్పటికీ ఇలా చేయడం దారుణమని ఫోన్లో వాపోయారు. దీనిపై తాము కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎమ్మార్వో హత్య కేసును పక్కదారి పట్టించడానికే సస్పెండ్ ఉత్తర్వులనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details