Older Brother killed Younger Brother: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను సరిగా చూడటం లేడంటూ... క్షణికావేశంలో తమ్ముడిని బండరాయితో మోదీ అన్న హత్య చేశాడు. జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో నివాసముండే కొమిరె యోనె తల్లిదండ్రులను తన వద్ద ఉంచుకొని వారి బాగోగులు చూసుకుంటున్నాడు. ఈమధ్య తల్లిదండ్రుల భాగోగుల విషయంలో కొమిరె యోనె నిర్లక్ష్య వైఖరి అవలింబిస్తున్నాడు.
తల్లిదండ్రులను సరిగ్గా చూడట్లేదని.. అన్నను చంపిన తమ్ముడు - తమ్ముడిని చంపిన అన్న
Older Brother killed Younger Brother: రాను రాను రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తల్లిదండ్రులను సరిగా చూడటం లేడంటూ తమ్ముడిని బండరాయితో మోదీ.. అన్న హత్య చేశాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![తల్లిదండ్రులను సరిగ్గా చూడట్లేదని.. అన్నను చంపిన తమ్ముడు Older Brother killed Younger Brother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16886987-972-16886987-1668063041799.jpg)
అన్నను చంపిన తమ్ముడు
ధీనబంధూబస్తీలో నివాసముండే అన్న కొమిరె డేవిడ్.. తల్లిందండ్రులను సరిగ్గా చూసుకోవాలని తమ్ముడు యోనెకు పలుమార్లు సూచించారు. ఐనా ఫలితం లేకపోవడంతో.. రాత్రి ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. క్షణికావేశంలో డేవిడ్.. తమ్ముడు యోనె తలపై బండారాయితో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. డేవిడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
ఇవీ చదవండి: