MP TRAVEL IN RTC BUS: వాహనం మొరాయిస్తే ఎలాంటి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయకుండా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సాధారణ గ్రామీణ మహిళా ప్రయాణికురాలిగా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుని మరీ ప్రయాణించారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆమె వాహనం మొరాయించింది. దీంతో ఆమె వెనకా ముందూ ఆలోచించకుండా సాధారణ గ్రామీణ మహిళా ప్రయాణికురాలిగా ఆర్టీసీ బస్సులో తన అంగ రక్షకులతో పాటు టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఎంపీ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం గ్రామానికి వెళ్తుండగా ఇది జరిగింది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఆర్టీసీ బస్సులో ఎంపీ ప్రయాణం... ఎందుకంటే..! - madhavi mp
MP TRAVEL IN RTC BUS: మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు వాహనం మొరాయిస్తే ఎక్కడలేని కోపం చిరాకు వస్తాయి కదా. సాధారణ ప్రజలం మనమే ఇలా స్పందిస్తే.. ప్రభుత్వాధికారుల వాహనం మొరాయిస్తే ఎలా స్పందిస్తారు. సాధారణంగా సమయం వృథా అవుతుందని తమ సిబ్బందిపై అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఓ ఎంపీకి ఇదే పరిస్థితి ఎదురైతే వెనకా ముందూ ఆలోచించకుండా సాధారణ ప్రయాణికురాలిగా ఆర్టీసీ బస్సెక్కారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా... అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.
MP TRAVEL IN RTC BUS