Modakondamma: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి జాతరను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తితిదే తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ... ఆలయం నుంచి శతకం పట్టు వద్దకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు.
వైభవంగా "మోదకొండమ్మ" జాతర.. భారీగా తరలివచ్చిన భక్తులు - అల్లూరి సీతారామరాజు జిల్లా తాజా వార్తలు
Modakondamma: గిరిజన ప్రాంత ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ వారి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతరను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
పాడేరులో ఘనంగా ప్రారంభమైన మోదకొండమ్మ ఉత్సవాలు