maoist arrest :మావోయిస్టుల చేతిలో 2018లో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసులో ప్రధాన నిందితుడు రైనో అరెస్టయ్యాడు. అంధ్రా ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల సమయంలో ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఏవోబి ప్రత్యేక జోన్ డివిజనల్ కమిటీ సభ్యుడు జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో మూడు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఐదులక్షల రివార్డు పట్టిచ్చిన వారికి ఉంది.
ప్రధాన నిందితుడు... ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సొమల హత్యోదంతంలో ప్రధాన నిందితుడు ఏవోబి ప్రత్యేక జోన్ డివిజనల్ కమిటీ సభ్యుడు రైనో... ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాలలో మావోయిస్టు విధ్వంసకర కార్యక్రమాలు, హత్య కేసుల్లో కీలక పాత్ర పోషించాడన్నది పోలీసుల అభియోగం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నవ్యక్తి ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల సమయంలో అరెస్ట్ చేశారు. జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో గా ఈ మావోయిస్టు నేత సీలేరు ప్రాంతానికి చెందినవాడు. ఏవోబిపై గట్టి పట్టు ఉంది.