అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీ-కారు ఢీ, ఆరుగురు మృతి - ఏపీ విశేషాలు
15:48 November 22
ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాచలం వెళ్లి వస్తుండగా ప్రమాదం
Road Accident in Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. భద్రాచలం నుంచి తిరిగి ఛత్తీస్‌గఢ్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.