ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన ఉష్ణోగ్రతలు ఓవైపు.. తగ్గని పర్యాటకులు మరోవైపు - అల్లూరి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

Lowest Temperatures: ఓ వైపు చలి పెరుగుతున్నా..అల్లూరి జిల్లా లంబసింగిలో పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడంలేదు. కనిష్ఠంగా 0.5 డిగ్రీలుగా లంబసింగిలో ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పార్కింగ్ చేసిన వాహనాలపై మంచు పేరుకుపోయింది. మంచు తీవ్రతతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

Lowest Temperatures
తగ్గిన ఉష్ణోగ్రతలు

By

Published : Jan 9, 2023, 2:13 PM IST

Lowest Temperatures: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో 0.5 డిగ్రీలు.. చింతపల్లిలో కనిష్ఠంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజుల నుంచి మన్యం జిల్లాలో చలి తీవ్రత అధికమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే చలిగాలులు వీస్తుండగా.. ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. లంబసింగిలో పార్కింగ్ చేసిన వాహనాలపై మంచు పేరుకుపోయింది. మంచు తీవ్రతతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంత చలిలో కూడా వంజంగి పర్యాటక ప్రాంతాన్ని తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. వంజంగి కొండల్లోని ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించేందుకు సాహసం చేస్తున్నారు.

అల్లూరి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details