అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. అందులో తెలుగు వాడైన ప్రశాంత్‌ది హైదరాబాద్. ప్రశాంత్‌కు సంబంధించిన వివరాలను ఆయన తండ్రి బాబూరావు మీడియాకు వివరించారు. ప్రశాంత్ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు.
మా కొడుకుని క్షేమంగా అప్పగించండి...
దిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తామని బాబూరావు తెలిపారు. మా కొడుకుని క్షేమంగా అప్పగించాలని కోరతామని చెప్పారు. విశాఖకు చెందిన తాము ఆరేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలోని భరత్‌నగర్‌లో ఆరేళ్లుగా ఉంటున్నామని తెలిపారు.