LADY CONDUCTOR: నేటి సమాజంలో ఆడవారి గొప్పతనం ఏదో ఒక అంశంలో బయటపడుతోంది. ఒకప్పుడు వంటిల్లే తమ లోకం అనుకున్నవారు కాస్తా.. అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతూ మేము కూడా ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
'తగ్గేదేలే' అంటున్న మహిళా కండక్టర్.. ఎందుకో తెలుసా? - ఏపీ తాజా వార్తలు
LADY CONDUCTOR: 'ఆడదంటే అబల కాదు సబల' అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతూ.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఇది మగవారు మాత్రమే చేయగలరు అనుకునే పనులను సైతం.. అలవోకగా చేసి తమ సత్తా చాటుకుంటున్నారు. ఆడవారంటే వంటింట్లో కుందేలు అనుకునేవారికి.. మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ మహిళా కండక్టర్ చేసిన పని అందరి ప్రశంసలందుకునేలా చేసింది. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఇది చూడండి..
మగవాళ్లతో పోటీపడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులు మాత్రమే చేయగలిగే పనుల్లోనూ.. మేము ఉన్నామంటూ చేదోడుగా నిలుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ మహిళా కండక్టర్ చేసిన పని అందరి ప్రశంసలందుకుంటోంది. పాడేరు డిపో నుంచి గూడెం వెళ్లే RTC బస్సు.. బొక్కెళ్లు గ్రామం వద్ద టైరు పంచరై ఆగిపోయింది. అదే బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లోవకుమారి.. డ్రైవర్ నాయుడుకు టైర్ విప్పడంలో సహకరించారు. నా పని కాదంటూ వెనక్కి తగ్గకుండా.. బస్సులో ఉన్న వేరే టైరును బిగించి విధుల్లో తనకున్న నిబద్ధతను చాటారు. కండక్టర్ లోవకుమారి చొరవను ప్రయాణికులు ప్రశంసించారు.
ఇవీ చదవండి: