KGBV Students Protest: అల్లూరి జిల్లా పాడేరు కేజీబీవీ పాఠశాలలో సదుపాయాలు సరిగాలేవంటూ.. విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పాడేరు కేజీబీవీ పాఠశాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయానికి విద్యార్థినులు ర్యాలీగా తరలివచ్చారు. పాడేరు కేజీబీవీ ప్రత్యేక అధికారిని తప్పించాలంటూ కలెక్టరేట్ ప్రాంగణంలో నినాదాలు చేశారు. బయటకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా.. విద్యార్థినులు అక్కడ తమ నిరసన కొనసాగించారు. మెనూ బాగుండటం లేదని, తాగునీళ్లకు ఇబ్బందులు పడాల్సివస్తోందని విద్యార్థినులు వాపోయారు.
సమస్యలు పరిష్కరించాలని..కేజీబీవీ విద్యార్థినులు 4 కిలోమీటర్ల ర్యాలీ - KGBV Students Protest
Students Agitation: తమ సమస్యల పరిష్కారం కోసం పాడేరు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు కలెక్టరేట్ వద్ద ఆందోళన తెలిపారు. పాఠశాల నుంచి కలెక్టరేట్‌కు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. వర్షం, బురదను లెక్కచేయకుండా విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు.
నాలుగు కిలోమీటర్లు ర్యాలీ
"మాకు మెనూ బాగుండటం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి.. మేము తినలేకపోతున్నాం. ఏదైనా సమస్యలు వచ్చినా పరిష్కరించటం లేదు. మాకు గతంలో బాగుండేది". -పాడేరుకేజీబీవీ విద్యార్థులు
ఇవీ చదవండి: