Infant deaths in Alluri district అల్లూరి సీతారామరాజు జిల్లాలో శిశు మరణాలు ఆగడం లేదు. పాడేరు మండలం గుర్రగరువులో గంట వ్యవధిలోని ఉదయం ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నెల రోజుల కిందట మరో చిన్నారి చనిపోయింది . ముగ్గురు వయసు 3 నెలలు లోపే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టైఫాయిడ్ లక్షణాలతో చిన్నారులు మృతి చెందారని బంధువులు చెబుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో చిన్నారులు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జిల్లాలో రూడకోటలో 21 శిశు మరణాలు మరువక ముందే, మరోసారి నమోదు అవుతున్న వరుస మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Infant deaths అల్లూరిలో ఆగని శిశు మరణాలు, కారణం అదేనా
Infant deaths in Alluri district అల్లూరి సీతారామరాజు జిల్లాలో తల్లులకు కడుపుకోత కొనసాగుతోంది. నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లులకు చివరకు ఆవేదనే మిగులుతోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన పిల్లలు అకస్మాతుగా మృత్యు ఒడిని చేరుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
శిశు మరణాలు