High Court: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గిరిజనులకు సంబంధించిన 15 ఎకరాల 23 సెంట్ల భూమిని గిరిజనేతరులు ఆక్రమించారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన సర్పంచ్ ఉలవల శివ కనకరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదన వినిపించారు. గిరిజనుల చట్టాలను ఉల్లంఘించి గిరిజనేతరులు ప్రభుత్వ భూమిని ఆక్రమించటం చట్టరీత్యా నేరమని న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్నారంటూ ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు. తక్షణమే కట్టడాలు నిలిపివేయాలని హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఆరు వారాలకు వాయిదా వేసింది.
గిరిజనుల భూమి ఆక్రమణ పిల్‌పై హైకోర్టు విచారణ... ప్రతివాదులకు నోటీసులు - ఏపీ తాజా వార్తలు
High Court: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల భూమి ఆక్రమించారంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు
TAGGED:
ap latest updates