SNOWFALL IN AP : రాష్ట్రంలో చలి తీవ్రత ఎంత మాత్రం తగ్గడం లేదు. తెల్లవారుజామున చలి పంజా విసురుతోంది. అల్లూరి జిల్లా పాడేరు ఏజన్సీలో చలి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు, చలితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి కాపాడుకుంటున్నారు.
రథసప్తమి దాటినప్పటికీ, వేసవి సమీపిస్తున్నప్పటికీ చలి, పొగ మంచు ఆగలేదు. చలిమంటలు, ఉన్ని దుస్తులు ధరిస్తే కానీ బయటికి రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. లైట్ల వెలుతురులోనే వాహనాలు నడుస్తున్నాయి. సుమారు 10 నుంచి 20 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడంలేదంటే.. పొగముంచు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.