Girl Suspicious Death: పనుల కోసం పొలానికి వెళ్లి వచ్చిన ఆ తల్లిదండ్రులకు కుమార్తె విగతజీవిగా కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కానీ విషయం బయటకు రాకుండా గ్రామంలో పంచాయితీ నిర్వహించి, బాలికను పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆలస్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అల్లూరి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అభంశుభం తెలియని 12 ఏళ్ల అమాయక ఆదివాసీ బాలిక అనునూనాప్పద స్థితిలో మరణించింది. అత్యాచారం, ఆపై హత్య జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగు తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరగగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక మరో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈనెల 2వ తేదీన ఉదయం ఆమె ఇంటిలో ఉంది.
కుమార్తెను చంపిన తల్లి - సహకరించిన అమ్మమ్మ
ఆ సమయంలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారంతా ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పొలం పనుల నుంచి బాధిత బాలిక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు. పని ముగించుకుని వచ్చిన తల్లిదండ్రులకు తమ కుమార్తె ఇంటిలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.