ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గప్​చుప్​గా గంజాయి తరలిస్తూ.. కారుతో సహా చెరువులో పడ్డారు!

Scorpio fell into reservoir: గంజాయి తరలిస్తున్న ఓ స్కార్పియో వాహనం జలాశయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.

Scorpio fell into Reservoir at alluri seetharamaraju district
జలాశయంలోకి దూసుకెళ్లిన గంజాయి తరలిస్తున్న వాహనం

By

Published : May 16, 2022, 11:16 AM IST

Updated : May 17, 2022, 6:41 AM IST

జలాశయంలోకి దూసుకెళ్లిన గంజాయి తరలిస్తున్న వాహనం
Scorpio fell into reservoir: పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. గంజాయి తరలిస్తున్న వాహనం జలాశయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వాహనాన్ని బయటకు తీసి గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడైన వైకాపా నాయకుడిని అరెస్టు చేశారు. మారేడుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం నుంచి రాజమహేంద్రవరానికి కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం వేకువజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. మారేడుమిల్లి వద్దకు వచ్చేసరికి కారు వేగం పెంచి వెళ్లిపోతుండగా.. పోలీసులు వెంబడించారు. రంపచోడవరం మండలం భూపతిపాలెం జలాశయం మలుపు వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టి.. జలాశయంలో బోల్తాపడింది. పోలీసులు పొక్లెయిన్‌తో వాహనాన్ని బయటకు తీశారు. ఇందులో 300 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈయన రంపచోడవరం పంచాయతీ 12వ వార్డు సభ్యుడు, వైకాపా నాయకుడు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణారెడ్డి గతంలో పలు గంజాయి, కలప అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వైకాపా అండదండలతోనే..

వైకాపా అండదండలతోనే గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ, గంజాయి రవాణా వెనక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నా.. అమాయక గిరిజనులు బలవుతున్నారన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : May 17, 2022, 6:41 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details