ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పండుగను చూస్తే, ముచ్చెమటలు పట్టాల్సిందే.. ! కర్రలతో కొట్టేసుకునే ఆచారం..! ఎక్కడంటే..? - ఏపీలో వింత పండగలు

Festival at Andhra Odisha Border Region: పండగ అంటే కొత్త బట్టలు వేసుకుని, సరదాగా.. ఉల్లాసంగా గడపడం కాదంటున్నరు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో ఉండే గిరిజనలు. ఒంటిపై బట్టలు తీసీ.. మాంచి వాతంగా ఉన్న కర్రతో ఒకరికొకరు కొట్టుకోవడంలోనే పండగ సరదా ఉందంటారు వారు. బాబోయో..ఇదేం పండగ అని అనుకుంటున్నారా.. ! అయితే, మీరు ఈ కధను పూర్తిగా చూడాల్సిందే.

Tribal Festival
గిరిజనుల పండగ

By

Published : Jan 28, 2023, 1:30 PM IST

Festival at Andhra Odisha Border Region: సాధారణంగా పండగ అంటే బంధువులు ఇంటికిరావడం.. విందు భోజనం చేయడం చూస్తాం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గల మల్కన్​గిరి జిల్లా పరిధిలోని.. ఆంద్రాహాల్ పంచాయతీ కేంద్రంలో ప్రతి ఏడాది జరిగే వింత పండగ చూపరులను ఆకట్టుకుంది. సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణలో ఎంతో ప్రత్యేకత ఉన్న.. బోండా గిరిజనుల ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఏడాది జనవరి నెలలో జరిగే జట్టి పరబ్ (కొట్టుకునే పండుగ) ప్రత్యేకంగా నిలుస్తుంది.

మొదటగా గ్రామ పూజారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి పండుగను ప్రారంభిస్తారు. అనంతరం యువకులంతా వచ్చి కొట్టుకుంటారు. కళ్ళు చెట్టు కొమ్మలతో వీపులపై గట్టిగా కొట్టుకుంటారు. ఎటువంటి రాగ ద్వేషాలు.. కక్షలు లేకుండా కేవలం ఆచారం కోసమే ఇలా చేస్తామని వారంతా అంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వీపుల మీద గాయాలకు బంధువులైన మహిళలు పసుపు లేపనం పూస్తారు. కేవలం ఒక గంట జరిగే ఈ పండుగకి గ్రామనికి ఉన్న వారు.. వృత్తిరిత్యా బయట ఉన్న వారు కూడా స్వగ్రామానికి చేరుకుంటారు. పండగలో భాగంగానే ఇలా చేస్తున్నామని వారు చెప్తుండటంతో.. పండగ సర్వత్రా ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న గిరిజనుల పండగ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details