ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీలేరు నీరు కోసం రైతుల ఎదురుచూపులు

By

Published : Jan 4, 2023, 12:53 PM IST

Sileru Water Issue: గోదావ‌రి డెల్టాలోని ర‌బీ పంట‌ల‌కు సీలేరు నీరు కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా ప‌వ‌ర్‌ కెనాల్ మ‌ర‌మ్మ‌తులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గోదావ‌రి ర‌బీ పంట‌ల‌కు అత్య‌వ‌సరంగా రోజుకు 4వేల క్యూసెక్కులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు. గోదావ‌రి డెల్టాలోని ర‌బీ పంట‌ల‌కు సీలేరు కాంప్లెక్సు నుంచి అదనంగా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు కోరుతున్నారు.

Sileru
సీలేరు

Sileru Water Issue: గ‌త వారం రోజులుగా సీలేరు జ‌లాశ‌యం నుంచి 2700 క్యూసెక్కులు నీరును విడుద‌ల చేసి నిలిపివేశారు. అయినా స‌రే రబీ వరినాట్లకు సీలేరు కాంప్లెక్సు నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు కోరుతున్నారు. ఏటా రబీ సీజన్‌లో పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కులు, డొంకరాయి రిజర్వాయర్‌ నుంచి నేరుగా 2,700 క్యూసెక్కులు.. మొత్తం 6,700 క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేసేవారు. అయితే ఇటీలవ డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి పడడంతో పొల్లూరుకు నీటి సరఫరా నిలిచిపోయింది.

ఒక ప‌క్క గోదావ‌రి డెల్టాలోని ర‌బీ పంట‌ల‌కు నీరు స‌క్ర‌మంగా అంద‌క‌పోవ‌డంతో గోదావరి డెల్టాకు అత్యవసరంగా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు కోరడంతో వారం రోజులు పాటు డొంకరాయి జలాశయం నుంచి 2,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి నిలిపివేశారు. మొత్తం 1.6 టీఎంసీలు నీటిని విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ నీరు స‌రిపోక‌పోవ‌డంతో ఇంక‌నూ నీరు విడుద‌ల చేయాల‌ని ఇరిగేష‌న్ అధికారులు జెన్‌కో అధికారులు మీద ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప‌వ‌ర్‌కెనాల్‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న వినియోగంలోకి తీసుకురావ‌డానికి అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప‌వ‌ర్ కెనాల్‌ను వినియోగంలోకి తీసుకువ‌చ్చి ప‌వ‌ర్ కెనాల్ ద్వారా గోదావ‌రి డెల్టాకు నీరు విడుద‌ల చేయ‌డానికి అదికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details