Donkarai Power Canal: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్ కెనాల్‌కు గండి పడింది. సమాచారం అందుకున్న జెన్ కో అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి మరమ్మతు చర్యలు చేపట్టారు. డొంకరాయి జలాశయం నుంచి పవర్ కెనాల్ వస్తున్ననీరు దిగువకు నీరు వృథాగా పోతోంది. దీంతో అధికారులు డొంకరాయిలో విద్యుదుత్పత్తి నిలిపివేసి పవర్‌కెనాల్‌కు నీరు విడుదల ఆపేశారు. సుమారు 16 మీటర్లు పొడవున గండి పడిందని అధికారులు తెలిపారు. పవర్‌కెనాల్‌కు గండి పడటం వల్ల డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్కేంద్రాలలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ పవర్‌కెనాల్‌కు 2019లో గండిపడింది. అప్పుడు రూ.3 కోట్లు వ్యయంతో కెనాల్‌కు గండిపూడ్చారు.
డొంకరాయి పవర్ కెనాల్‌కు గండి...వృథాగా పోతున్న నీరు - అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు కాంప్లెక్స్
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్ కెనాల్‌కు గండి పడింది. సుమారు 16 మీటర్లు పొడవున గండి పడిందని అధికారులు తెలిపారు. ఈ పవర్‌కెనాల్‌కు 2019లో ఒకసారి గండిపడింది.
సీలేరు కాంప్లెక్స్