Godavari Flood Victims protest for help: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని నందిగామ ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో వరద బాధితులు ఆందోళన చేపట్టారు. ముంపు బాధితులకు ఆర్థిక సాయంతోపాటు, నిత్యావసర వస్తువులు అందజేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గోదావరి ముంపు ప్రాంతలపై ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తోందని సీపీఎం నాయకులు మండిపడ్డారు.
గోదావరి ముంపు బాధితులను ఆదుకోవాలని సీపీఎం ఆందోళన - గోదావరి వరద భాదితులు
Flood Victims అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో ముంపు బాధితులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ వంటపాత్రలను అందించింది.
ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని ఆందోళన చేపట్టిన సీపీఎం
Reliance Foundation Helps To Flood Victims: వరద బాధితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వంటపాత్రలను అందించారు. సాకూరు, ఇందుపల్లి గ్రామాల వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే వంట పాత్రల కిట్లను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ అందించారు. సామాజిక స్పృహతో రిలయన్స్ ఫౌండేషన్ వరద బాధితులకు వీటిని అందించడం అభినందనీయమని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి: