Alluri Sitaramaraju district: రాష్ట్రంలో చలిగాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిమంటలతో తాత్కాలికంగా సేద తీరుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి శీతలమయమైంది. చలి కారణంగా ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
అల్లూరిలో చలి పులి.. మూగజీవాలు సైతం గజగజ.. చలిమంటలతో ఉపశమనం - Andhra Pradesh Main News
Alluri Sitaramaraju district: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలిగాలులు, మంచు కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. అల్లూరి జిల్లాలో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
![అల్లూరిలో చలి పులి.. మూగజీవాలు సైతం గజగజ.. చలిమంటలతో ఉపశమనం Alluri Sitamaraju district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17453079-1088-17453079-1673412093384.jpg)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నరాలు లాగే చలి... మూగజీవాలు సైతం గజగజ
చింతపల్లి, మినుములూరులో 7 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. చలి పెరగడంతో ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మూగజీవాలు సైతం చలిమంటలు వద్ద సేద తీరుతున్నాయి. ఉన్ని దుస్తులు వేసుకుంటే గాని బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నరాలు లాగే చలి... మూగజీవాలు సైతం గజగజ
ఇవీ చదవండి:
Last Updated : Jan 11, 2023, 10:55 AM IST