అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో వరద బాధితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యుడు రవినేశ్‌కుమార్ పేర్కొన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కూనవరం మండలంలో కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. కూనవరం మండలంలోని శబరి కొత్తగూడెంలో వరద బాధితులతో వారు మాట్లాడారు. కేంద్ర బృందం సభ్యుడు మురుగునాథమ్, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సూరజ్ గనోరే, రామశేషు, ఓఎస్డీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Central team: "బాధితుల సమస్యలను.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం"
Central team: గోదావరి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పోలవరం ప్రాంతాన్ని పరిశీలించింది. ముందుగా సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద నెక్లెస్ బండ్ ప్రాంతాన్ని సందర్శించారు. వరద నష్టాలపై పోలవరంలో సమాచారశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను బృంద సభ్యులు పరిశీలించారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం యడ్లగూడెం చేరుకుని …...గోదావరి గట్టుని బృంద సభ్యులు పరిశీలించారు. పోలవరం పర్యటన అనంతరం ఈ బృందం ముంపు మండలమైన వేలేరుపాడు చేరుకుంది.
కేంద్ర బృందం పర్యటన
ప్యాకేజీ ఇవ్వండి.. వెళ్లిపోతాం:కేంద్ర బృందం ఎదుట వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో వరద తీవ్రత పెరిగిందని వాపోయారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించి పునరావాసం కల్పించాలని..తమ గ్రామాలను 41.5 కాంటూరులో చేర్చి పరిహారం అందించాలని కోరారు.
ఇవీ చదవండి: