Auto overturns in stream with passengers :ప్రయాణికులతో పాటు ఓ ఆటో వాగులో బోల్తా పడింది. వాగు ప్రవాహం ఉధృతిలో అతి కష్టం మీద వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మింగి మండలంలో జరిగింది. రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల - లబ్బర్తి రహదారిపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహింస్తోంది. అదే సమయంలో ఆటో వాగు దాటుతుండగా నీటి ప్రవాహంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు ప్రయాణికులతో వాగులో చిక్కుకుపోయారు. ఓ పక్కన వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో , స్థానికులు తాళ్ల సాయంతో అతి కష్టం మీద వారందరినీ రక్షించారు.
వాగులో కొట్టుకుపోయిన ఆటో, తప్పిన పెను ప్రమాదం - latest news about auto accident
Auto overturns ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వరదను అంచనా వేయకపోగా దానిని దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నీటి ప్రవాహ ఉధృతిలోనూ ఆటోను ప్రయాణికులతో వాగు దాటించేందుకు డ్రైవర్ యత్నించాడు. కానీ మధ్యలోకి వెళ్లిన తరువాత ఆటో పట్టు తప్పి వాగులో కొట్టుకుపోవడం మెుదలైంది. అది గమనిచిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వాగులో చిక్కుకున్నవారిని రక్షించారు.
వాగులో కొట్టుకుపోయిన ఆటో