ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంచంగిపుట్టులో ఆంత్రాక్స్ భయం.. ప్రాథమిక వైద్య పరీక్షల్లో నెగెటివ్‌

ANTHRAX RESULT NEGATIVE IN ALLURI : ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలను మరోసారి ఆంత్రాక్స్‌ భయం వెంటాడుతోంది. ఈ నెల 26వ తేదీన అల్లూరి జిల్లాలోని దొరగుడ గ్రామంలో ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసి ఆంత్రాక్స్​ అనే అనుమానంతో రక్త నమూనాలను సేకరించారు. అయితే తాజాగా వచ్చిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ కమిషనర్​ జె.నివాస్​ తెలిపారు.

health commissioner nivas on anthrax
health commissioner nivas on anthrax

By

Published : Aug 31, 2022, 10:06 PM IST

ANTHRAX RESULT NEGATIVE: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో ఆంత్రాక్స్ లక్షణాలనే అనుమానంతో ఏడుగురి నుంచి నమూనాలు సేకరించగా.. ఆ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. టిష్యూ కల్చర్ పరీక్షల్లో పూర్తి ఫలితాలు వచ్చేందుకు 48 గంటల సమయం పడుతుందని.. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామన్నారు. ముంచంగిపుట్టు గ్రామంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో జంతువులన్నింటికీ వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. స్థానికులకు మెడికల్ చెకప్, స్క్రీనింగ్ టెస్ట్​లు చేసి.. యాంటీబయాటిక్ సైతం ఇచ్చామన్నారు.

ముంచంగిపుట్టులో ఆంత్రాక్స్ భయం.. ప్రాథమిక వైద్య పరీక్షల్లో నెగటివ్‌

ఇదీ సంగతి:ముంచంగిపుట్టు మండలంలోని దొరగుడ గ్రామంలో ఈనెల 26న ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసి.. ఆశా కార్యకర్త ఫోటో తీసి వైద్యులకు పంపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌.. గురువారం దొరగుడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యాధికారుల బృందం గ్రామంలో పర్యటించి.. వైద్యపరీక్షలు నిర్వహించారు. 15 మందికి లక్షణాలు ఉండగా.. వారిలో ఏడుగురికి తీవ్ర లక్షణాలు ఉండటంతో.. వారి రక్తనమూనాలను సేకరించారు. విశాఖ కేజీహెచ్‌లోని ప్రయోగశాలకు రక్త నమూనాలు పంపుతామని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిర్ధరణకు వస్తామని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details