ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లూరి అనుచరుల కుటుంబాలు.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే? - Alluri Sitarama Raju Family in financial crisis

ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం..! ఆ తిరుగుబాటులో అసువులు బాసిన వారిలో.. అల్లూరి సీతారామరాజు ముందు వరుసలో ఉంటారు. వారి అనుచరులు గంటం దొర, మల్లు దొర వీరత్వం గురించి మాటల్లో చెప్పలేం..! స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ మహనీయుల్ని.. ఏ జయంతికో, వర్ధంతికో గుర్తుచేసుకుంటుంటాం. అయితే.. వారి కుటుంబసభ్యుల ప్రస్తుత దుస్థితేంటో ఓసారి చూద్దాం.

అల్లూరి అనుచరుల కుటుంబాలు
అల్లూరి అనుచరుల కుటుంబాలు

By

Published : Jun 27, 2022, 8:28 PM IST

Updated : Jul 5, 2022, 5:38 PM IST

అల్లూరి అనుచరుల కుటుంబాలు.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే?

Alluri Sitarama Raju Family: స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు అనుచరులు గంటం దొర, మల్లు దొరదీ ప్రత్యేక పాత్రే. బ్రిటిషర్ల అరాచకాలకు ఎదురొడ్డిన వీరిద్దరూ.. అన్నదమ్ములు. బ్రిటిషర్లు సీతారామరాజును చంపిన తర్వాత.. గంటం దొరను కాల్చి చంపారు. మల్లు దొరను అండమాన్ జైలులో పెట్టినా.. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. గంటం దొర కుమారుడైన జోగి దొరకు.. ఐదుగురు కుమారులు ఉండేవారు. వారిలో ఒకరైన బోడి దొర ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మరో కుమారుడి భార్య చిన్న అమ్ములు బతికే ఉన్నారు. మిగిలిన 9 కుటుంబాలకు చెందిన సుమారు 30 మంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం పరిసరాల్లో ఉన్నారు.

అల్లూరి అనుచరుల వారసుల ఇంటికి వెళ్లాలన్నా.. ఓ సాహసం చేసిన భావన కలుగుతుంది. నర్సీపట్నం నుంచి కె.డి.పేటకు వెళ్లి.. అక్కడి నుంచి నడింపాలెం వెళ్లాలి. వంతెన పక్క నుంచి లంక వీధిలో కిలోమీటరు వరకూ బురదలో ముందుకు సాగాలి. ఇక.. అటుగా వెళ్తే.. జీడితోట వద్ద.. బోడి దొర నివసిస్తున్న పూరిల్లు పరిస్థితేంటో ఓసారి చూద్దాం..

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమంటూ కొందరు వచ్చి పోతున్నారే తప్ప.. ఎవరూ సాయం చేసింది లేదు. రెండేళ్ల కిందట అందరికీ ఇళ్లు నిర్మిస్తామంటూ.. ఐదెకరాల జీడి తోట నరికించారు. అయినా పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా.. అప్పోసప్పో చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మీ.. ఈ కుటుంబాల తరఫున నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. సాయం చేయాలంటూ కనిపించిన వారందరికీ మొరపెట్టుకున్నారు. అయినా లాభం లేదని వాపోయారు. ప్రభుత్వాల సంగతి అటుంచితే.. సాయం చేసేందుకు కొన్ని సంఘాలు ముందుకొచ్చాయి.

ఇదీ చదవండి :

Last Updated : Jul 5, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details